Editor

AP

విశాఖలో గూగుల్ ఏఐ హబ్… రేపు ఢిల్లీలో చారిత్రాత్మక ఒప్పందం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాల భవిష్యత్తును మార్చే దిశగా ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్, విశాఖపట్నంలో సుమారు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.87,250 కోట్లు) భారీ పెట్టుబడితో ‘గూగుల్ ఏఐ హబ్’ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవబోతున్న ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి మంగళవారం న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థ ప్రతినిధుల మధ్య కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)…

National

జైళ్లలోని ఖైదీలకు ఓటు హక్కుపై సుప్రీంకోర్టులో విచారణ… కేంద్రానికి, ఈసీకి నోటీసులు..

దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న విచారణ ఖైదీలు, శిక్ష ఖరారు కాని సుమారు 4.5 లక్షల మందికి ఓటు హక్కును నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది.   ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ప్రముఖ…

TELANGANA

ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీలకు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ఫండ్..

ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. సమస్యల సత్వర పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సమస్యల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా, వెల్పేర్ సొసైటీలకు రూ.60 కోట్ల ఎమెర్జెన్సీ ఫండ్ ను విడుదల చేశారు. ఎస్సీ, బీసీ సొసైటీలకు రూ.10 కోట్లు చొప్పున నిధులను కేటాయించారు. ఈ నిధులను వినియోగించే అధికారులను సొసైటీ సెక్రటరీలకు కల్పించారు. సొసైటీల స్థాయిలోనే ప్రభుత్వ హాస్టల్స్ లో సమస్యలకు పరిష్కారం చూపనుంది.   ఫిజికల్…

TELANGANA

రేపు కోయంబత్తూరుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్….

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు కోయంబత్తూరు పర్యటనకు వెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొనే ప్రతిష్ఠాత్మకమైన 10వ ఎఫ్‌ఎంఏఈ-నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోయంబత్తూరులోని కుమారగురు ఇన్‌స్టిట్యూషన్స్‌లో జరగనుంది.   ఈ విషయాన్ని బీఆర్ఎస్ తన అధికారిక సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించే ఈ జాతీయ పోటీలకు కేటీఆర్…

AP

కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం..

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం అజెండా అంశాల తర్వాత మంత్రులతో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతోందని.. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీల సంస్థల రాకతో.. ఐటీ హబ్‌గా ఏపీ మారబోతోందని అన్నారు సీఎం చంద్రబాబు. ఇక పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థల నెలకొల్పేలా మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున కూటమి సర్కార్ పెట్టుబడులు తెస్తోందని సీఎం…

AP

AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు..

ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో.. ఏది ఆర్టిఫిషియలో తెలియడం లేదు. దీంతో చాలా మంది మోసపోతున్నారు. అలాంటిది ఏకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరుతో వీడియో కాల్స్ చేసి టీడీపీ నేతలను బురిడీ కొట్టించిన ఇన్సిడెంట్ కలకలం రేపింది. ఏఐని ఉపయోగించి…ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా వీడియో కాల్ చేసినట్లుగ తెలంగాణ టీడీపీ నేతలను గర్తుతెలియని వ్యక్తి మోసం చేశారు.   తెలంగాణ టీడీపీ నేతలకు టోకరా గత…

National

భారత్‌కు వచ్చిన తాలిబన్ మంత్రి..!

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. వారం రోజుల పాటు సాగనున్న ఈ పర్యటన, ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కీలకమైనప్పటికీ, భారత అధికారులకు ఇది ఒక కొత్త రకమైన దౌత్యపరమైన సవాలును విసిరింది. సమావేశాల సందర్భంగా ఏ దేశపు జెండాను ప్రదర్శించాలనే అంశం ఇప్పుడు పెద్ద చిక్కుముడిగా మారింది.   ఈ పర్యటనలో ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్.…

AP

అలాంటి పనులు చెయ్యను.. అలా అయితే రాజకీయాలు వదిలేస్తా.. పవన్ సంచలన వ్యాఖ్యలు..

ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో మత్స్యకారులతో మాటా మంతి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన కాకినాడ జిల్లాకు చెందిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 5 లక్షల చొప్పున రూ.90 లక్షల బీమా అందించారు.   ఉప్పాడ మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై వారంలోగా నివేదిక ఇవ్వాలని…

AP

అధికారంలో ఉన్నా, లేకున్నా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతాం: జగన్..

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్మికుల పక్షానే నిలబడతామని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడమే తమ ఏకైక లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. గురువారం నర్సీపట్నం, విశాఖపట్నం పర్యటనలో భాగంగా తనను కలిసిన ఉక్కు పరిశ్రమ ఉద్యోగులకు జగన్ ఈ మేరకు హామీ ఇచ్చారు.   పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు జగన్‌ను కలిసి,…

TELANGANA

ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బీసీ రిజర్వేషన్లు కూడా ఓ డ్రామా: హరీశ్ రావు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడం తెలిసిందే. ఈ పరిణామంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోందని, బీసీలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని, వారి కుట్రలు ఇప్పుడు…