జీహెచ్ఎంసీ ఉద్యోగులకు దసరా కానుక.. రూ.1.25 కోట్ల వరకు ఉచిత ప్రమాద బీమా..
దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తమ ఉద్యోగులకు భారీ శుభవార్త అందించింది. పారిశుద్ధ్య కార్మికుడి నుంచి ఉన్నతాధికారి వరకు అందరికీ వర్తించేలా, ఎలాంటి ప్రీమియం భారం లేకుండా రూ.30 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)తో జీహెచ్ఎంసీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల వినాయక నిమజ్జనం విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు…

