ఏపీకి పెట్టుబడుల వెల్లువ… దిగ్గజ కంపెనీలు రావడం ఖాయం: లోకేశ్..
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ‘ఆర్థిక ఉగ్రవాదం’ నడిచిందని, ప్రభుత్వ విధానాల కొనసాగింపు లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ కల్పన, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన…

