Editor

National

త్వరలో అందుబాటులోకి క్యాన్సర్ టీకా: కేంద్రమంత్రి జాదవ్..

మహిళలను ప్రభావితం చేస్తున్న క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు మరో ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ వెల్లడించారు. అయితే, ఈ టీకా వేసుకోవడానికి 9 నుండి 16 ఏళ్ల లోపు వయస్సు ఉన్న బాలికలు మాత్రమే అర్హులని తెలిపారు. ఈ టీకాపై పరిశోధనలు పూర్తి కావొచ్చాయని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.   ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని,…

National

భారత్ లోకి టెస్లా..! ప్రధానితో మస్క్ భేటీ తర్వాత మారిపోయిన సీన్..

అంతర్జాతీయంగా టెస్లా కార్లతో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్.. అతిపెద్ద ఆటోమొబైళ్ల వినియోగదారులున్న భారత్ లో అడుగుపెట్టాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోంది. కానీ.. సంస్థ ప్రణాళికలు, భారత్ లోని చట్టాలకు మధ్య పొంతన కుదరక ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న, అభివృద్ధిలో పరుగులు పెడుతున్న భారత్ వంటి మార్కెట్లోకి ప్రవేశించలేకపోయింది. కానీ.. ఇటీవల మారిపోతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో.. ఎలాన్ మస్క్ టెస్లా కార్లు భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది.…

AP

జగన్‌కు కష్టాలు తప్పవా..?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు మళ్లీ ఇబ్బందులు తప్పవా? ప్రజల్లో సానుభూతి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఏదో విధంగా జైలుకి వెళ్లాలని నిర్ణయించుకున్నారా? కావాలనే పోలీసులను ఆయన బెదిరించారా? బెయిల్‌పై వున్న జగన్ ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? ఎందుకు జగన్ సహనం కోల్పోయారు? దీనిపై కూటమి సర్కార్ ఆలోచన ఎలా ఉంది? కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   నోరు జారుతున్న జగన్   వైసీపీ అధినేత…

TELANGANA

రాష్ట్ర అవసరాలపై మంత్రి సీతక్క ప్రజెంటేషన్.. నిధులు ఇవ్వమని కేంద్రానికి విజ్ఞప్తి..

తెలంగాణ‌లోని తాగునీటి వ్య‌వ‌స్థ స్థిరీక‌ర‌ణ‌ కోసం అవ‌స‌ర‌మైన‌ నిధులు మంజూరు చేయాల‌ని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క కేంద్ర ప్ర‌భుత్వాన్ని విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ తాగునీటి అవ‌స‌రాలు తీర్చేందుకు నీతి ఆయోగ్ గ‌తంలో సిఫార్సు చేసిన విధంగా క‌నీసం రూ.16 వేల కోట్ల‌ను మంజూరు చేయాల‌ని కోరారు. ప్ర‌తి ఏటా తాగు నీటి అవ‌స‌రాల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం సుమారు రూ. 5 వేల కోట్ల‌ను వెచ్చిస్తుంద‌ని గుర్తు చేశారు. కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ…

TELANGANA

ఆరు నెలల తర్వాత పార్టీ ఆఫీసుకు కేసీఆర్.. వాటిపై చర్చించే అవకాశం..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. చాన్నాళ్ల తర్వాత పార్టీ ఆఫీసుకు వస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇంతకీ గులాబీ బాస్ ప్లాన్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల వైపు కాకుండా.. కేవలం ఉప ఎన్నికలపై ఫోకస్ చేశారా? అందుకోసమే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారా? అవుననే అంటున్నారు కొందరు నేతలు.   ఎంతమంది హాజరు?   బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్…

AP

జనసేన ఆవిర్భావ వేడుకలపై కీలక నిర్ణయం..

జనసేన ఆవిర్భావ వేడుకలకు సంబంధించి ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను జనసేనాని పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహించాలని జనసేన నిర్ణయించింది.   సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో జనసేన కీలకపాత్రను పోషించింది. ఘన విజయం తర్వాత మొదటి ఆవిర్భావ సభ కావడంతో… సభకు భారీ ఏర్పాట్లు…

National

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్.. ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషి..

భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గత రాత్రి వేర్వేరుగా రెండు గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లలో సీనియర్ అయిన జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా ఎంపిక చేశారు. జ్ఞానేశ్ కుమార్ స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషిని ఎంపిక చేశారు. మరో ఈసీగా సుఖ్‌బీర్ సింగ్ ఉన్నారు.   అంతకుముందు ప్రధానమంత్రి…

NationalTechnology

యూజర్ల కోసం కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చిన ఫోన్ పే..

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్స్‌ను ప్రారంభించింది. ఫోన్‌పే వినియోగదారులు యాప్‌లో తమ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, ప్రయాణ టికెట్ల బుకింగ్, బీమా కొనుగోలు, పిన్ కోడ్ ఆధారిత చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు.   ఫోన్‌పే వినియోగదారులు తమ కార్డులను టోకనైజ్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇకపై ప్రతి లావాదేవీకి తమ…

National

హమాస్ సంచలన ప్రకటన.. గాజాను వదులుకునేందుకు రెడీ..!

ఇజ్రాయెల్‌లో మారణహోమాన్ని సృష్టించి.. తద్వారా యుద్ధానికి కారణభూతమైన హమాస్ సంచలన ప్రకటన చేసింది. గాజా స్ట్రిప్ పై అధికారాన్ని వదులుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈజిప్ట్ ఒత్తిడితోనే హమాస్ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. గాజాలో ప్రస్తుతం పోలీస్, ఆరోగ్యం, పౌరసేవలు అన్నీ హమాస్ నియంత్రణలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి అధికారాన్ని పాలస్తీనా అధికార యంత్రాంగానికి బదలాయించేందుకు అంగీకరించింది. కాగా, హమాస్ నిర్ణయం వెనక డొనాల్డ్ ట్రంప్ విధానం కూడా ఒక కారణమని తెలుస్తోంది.   పాలస్తీనా…

TELANGANA

సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ.. సర్వత్ర ఉత్కంఠ..

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది.   గత విచారణ సందర్భంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సమాధానంగా……