Editor

TELANGANA

టిడిపికి రెడ్ బుక్..! బిఆర్ఎస్ కు పింక్ బుక్..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నిరంకుశ పాలన సాగిస్తుంది అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని కవిత ఫైరయ్యారు. జనగామలో మాట్లాడిన ఆమె తాము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని ఇంతకింత చెల్లిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో రెడ్ బుక్ లా తెలంగాణలో పింక్ బుక్ మెయింటైన్ చేస్తామన్నారు.   లెక్క చూస్తాం… వదిలిపెట్టం: ఎమ్మెల్సీ కవిత తమ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు…

TELANGANA

కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం..

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 19న పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.   సమావేశ నిర్వహణకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలతో పాటు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు,…

AP

వ‌ల్ల‌భ‌నేని వంశీకి 14 రోజుల రిమాండ్‌.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత‌ వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతోపాటు ఏ7 శివరామకృష్ణ, ఏ8 నిమ్మా లక్ష్మీపతికి కూడా న్యాయ‌స్థానం 14 రోజుల‌ రిమాండ్ విధించడంతో వీరిని విజ‌య‌వాడలోని జిల్లా జైలుకు తరలించారు.   గన్నవరం టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో పిటిషనర్ సత్యవర్ధన్ కిడ్నాప్, దాడి సహా అట్రాసిటీ కేసుల కింద వల్లభనేని వంశీని గురువారం ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చారు.…

AP

జగన్ కు మరో షాక్..! చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఆళ్ల నాని..

ఏలూరుకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. గురువారం ఉండవల్లికి వెళ్లిన ఆళ్ల నాని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నానికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.   ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు.…

National

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన..

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలసిిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్రపతి పాలను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్ లో 2023 నుంచి మైతేయి, కుకీ వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి.   అయితే, సీఎం ఓ వర్గానికే మొగ్గు చూపుతున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శించారు.…

TELANGANA

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కులగణన పూర్తి కావడంతో ఈ నెల 15వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని భావించారు. కానీ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కులగణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేపడుతున్నట్లు ప్రకటించారు.   ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్…

TELANGANA

కులగణన మరోసారి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై స్పందించిన కేటీఆర్..

కులగణన సర్వే తప్పుల తడకని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, దీనిని తాము స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కుల గణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో, కుల గణనలో పాల్గొనని వారి కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.   ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ, అసంపూర్తి…

AP

ఉత్తరాంధ్రకు వైసీపీ కొత్త బాస్..? ఎవరంటే..?

జగన్ నిర్ణయాలకు ఆ పార్టీ నేతలు షాకవుతున్నారా? నేతలు ఒకటి తలిస్తే.. అధినేత మరొకటి చేస్తున్నారా? ఉత్తరాంధ్రకు కొత్త బాస్‌ కన్నబాబు పేరు ప్రకటించడం ఏం జరిగింది? అధినేతపై ఎందుకు ఉత్తరాంధ్ర నేతలు గుర్రుగా ఉన్నారా? జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.   వైసీపీలో ఏం జరుగుతోంది?   ఏపీలో అధికార పోయినా మాజీ సీఎం జగన్ తీరు మారలేదా? అధినేతపై కొందరు ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారా? ప్రజల్లోకి…

AP

వల్లభనేని వంశీపై కిడ్నాప్ కేసు.. ఎస్సీ, ఎస్టీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలోని అపార్ట్ మెంట్ లో ఉన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. మొత్తం 7 సెక్షన్ల కింద కేసు నమోదయింది.   వైసీపీ అధికారంలో…

National

ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు.. ఉచితాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి..

భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తమ స్వార్థం కోసం పార్టీలు ఓటర్లపై ఉచిత వరాల జల్లులు కురిపిస్తున్నాయి. కేవలం ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో నోటి ఏది వస్తే అది ఉచిత వాగ్ధానాలు చేస్తున్నారు. ప్రజల పని చేయడానికి ఇష్టం లేకుండా పార్టీలు చేస్తున్నాయి. ఏ పని చేయకుండానే ఆహారం, అకౌంట్లలో డబ్బులు వేస్తామని హామీలు ఇస్తున్నారు. ఎన్నికల్లో తమను గెలిపిస్తే మహిళలకు అకౌంట్లలో డబ్బుల వేస్తాం, ఉచిత బస్సు సౌకర్యం అందజేస్తాం.. ఇలా నోటికి వచ్చినట్లు…