మణిపుర్‌లో బిజెపికి జేడీయూ షాక్..
ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారినట్లుగా కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజేపీ)కి ఇంతవరకు మద్దతు ప్రకటించిన జనతా దళ్ యునైటెడ్ (జేడియూ).. తాజాగా తన మద్దతును ఉపసంహరించుకున్నట్లు ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు జేడీయూ పార్టీ మణిపూర్ అధ్యక్షుడు క్షేత్రమయుం బీరెన్ సింగ్ (ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కాదు) ప్రకటన జారీ చేశారు. మణిపూర్ లో తమ పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతోందని.. తమ పార్టీకి…

