తెలంగాణ ఆర్టీసీలో కొలువుల జాతర..!
తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ)లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కండక్టర్ పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 3 వేల ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి విడతలో భాగంగా 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నియామకాలకు అనుమతి కోరుతూ టీఎస్ఆర్టీసీ…

