కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్..
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ భూములపై ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని భూములు ప్రభుత్వ భూములేనని అందులో పేర్కొంది. ఈ భూముల్లోనే కేంద్రీయ విశ్వవిద్యాలయం, మరికొన్ని సంస్థలు, బస్టాండ్ వంటివి వచ్చాయని తెలిపింది. సుమారు 20 ఏళ్లకు పైగా ఈ 400 ఎకరాల స్థలం…

