హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కలకలం.. ట్రైనీ ఐపీఎస్ పై కేసు..
దేశంలోనే అత్యున్నత పోలీస్ శిక్షణా కేంద్రమైన హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న తీవ్ర ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి అనే ట్రైనీ ఐపీఎస్‌పై కేసు నమోదైంది. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, అకాడమీలో శిక్షణ పొందుతున్న ఒక ఐపీఎస్ ప్రోబేషనర్, తన సహోద్యోగి అయిన…

