Editor

AP

ఏపీ రాజధానికి రానున్న మరో ప్రఖ్యాత విద్యాసంస్థ..

ఏపీ రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో పాటు అమరావతిలో రాజధాని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది. దీంతో గత అయిదేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. ఈ క్రమంలో అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు, సంస్థలు ఏర్పాటు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.   ఈ క్రమంలో ప్రఖ్యాత విద్యా సంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) తన క్యాంపస్‌ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి…

TELANGANA

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేసిన పోలీసులు..

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ.. ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ విధుల్లో గల సీఐకు కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వివాదం సాగింది. తాను ప్రస్తుతం ఇతర…

TELANGANA

నేడే ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఆవిష్కరణ.. కీలక ప్రకటన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..

సచివాలయంలో ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. విజయోత్సవాల్లో భాగంగా సినీ రంగ ప్రముఖులతో మ్యూజికల్ నైట్, నగరంలోని ప్రముఖ హోటళ్లు, డ్వాక్రా, రెస్టారెంట్లు, సంస్థలచే స్టాళ్ళ ఏర్పాటు, భారీ ఎత్తున డ్రోన్ షో, లేజర్ షో, క్రాకర్స్ షో జరగనున్నాయి. వీటన్నింటిపై రివ్యూ చేశారు సీఎస్. 7 వ తేదీన వందేమాతరం శ్రీనివాస్ బృందం, 8న రాహుల్ సిప్లిగంజ్, 9న థమన్‌తో సినీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అదే…

National

అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో కాల్పుల కలకలం..!

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయం వద్ద కాల్పులు కలకలం రేగాయి. శిక్ష అనుభవించేందుకు మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ దేవాలయానికి వెళ్లారు. ఆయన మెడలో పలక తగిలించుకొని ఆలయం బయట కూర్చున్నారు.   ఆ సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో బాదల్‌పై కాల్పులు జరిపేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమై బాదల్‌ అనుచరులు అతడ్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలో సుఖ్‌బీర్ సింగ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఇంతకీ కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు?   పంజాబ్‌లో…

National

రూ. 2,000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..

దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి ఏడాదిన్నర కిందటే బ్రేక్ పడింది. అప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు క్రమంగా తెరమరుగు అవుతోంది. వీటిపై ఎలాంటి లావాదేవీలు కూడా జరగట్లేదు. పెద్ద నోట్లు చలామణిలో ఉన్నప్పటికీ క్రయవిక్రయాలు నమోదు కావట్లేదు.   గత ఏడాది మే 19వ తేదీ నుంచి 2,000 రూపాయల నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియను ఆరంభించింది రిజర్వ్ బ్యాంక్. చలామణిలో ఉన్న ఈ నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవడానికి గత ఏడాది…

TELANGANA

కవితకు కేసీఆర్ సంకేతాలు..? రంగంలోకి కవిత..?

బీఆర్ఎస్‌లో కలహాలు తారాస్థాయికి చేరాయా? హరీష్‌రావుపై కేసు నమోదు కావడంతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కవితకు రూట్ క్లియర్ అయ్యిందా? లీడర్ షిప్ కోసం ఫ్యామిలీలో జరిగిన చర్చ ఏంటి? కేటీఆర్ తర్వాత కవిత తెరపైకి రావడానికి కారణాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.   బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు ఎవరు తీసుకుంటున్నారు? తొలుత కేటీఆర్‌కే పగ్గాలు అందుకుంటారని నేతలు భావించారు. ఈలోగా కవిత తెరపైకి రావడానికి కారణాలేంటి? అధినేత ఆలోచన…

AP

ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. వచ్చే ఏడాదిలో ఫ్రీ బస్సు పథకం..?

ఏపీ కేబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై సుధీర్ఘంగా సాగింది. తాడేపల్లిలోని సచివాలయంలో మంగళవారం కేబినెట్ సమావేశాన్ని సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు సమాచారం. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యువజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలుపగా, రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం ప్రారంభం కాని గృహాలను రద్దు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.   ముందుగా కేబినెట్ భేటీలో చర్చించవలసిన…

TELANGANA

ఆ నీటిలో మాకు అధిక వాటాను ఇవ్వాలి: కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి..

గోదావరి-కావేరీ నదుల అనుసంధానంతో తెలంగాణ అధిక భూభాగాన్ని కోల్పోతోందని, కాబట్టి తమకు నీటి వాటాలో ఎక్కువ ఇవ్వాలని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. జాతీయ జల అభివృద్ధి సంస్థ 74వ పాలకమండలి సమావేశం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ఈరోజు జరిగింది.   ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇంజినీర్లు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ…

AP

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం… మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం..

రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, విద్యాప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేశ్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు సమీక్ష నిర్వహించారు.   ఈ సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ… పదో తరగతి పూర్తిచేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. ప్రభుత్వ…

National

ఫ్లోర్ లీడర్లతో లోక్ సభ స్పీకర్ సమావేశం…. రేపటి నుంచి యథావిధిగా పార్లమెంటు సమావేశాలు..!

పార్లమెంటు కార్యకలాపాల్లో ప్రతిష్టంభన ఏర్పడడం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో… లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేడు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం నిర్వహించారు. టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, కాంగ్రెస్ నుంచి గౌరవ్ గోగోయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, సమాజ్ వాదీ పార్టీ నుంచి ధర్మేంద్ర యాదవ్, జేడీయూ నుంచి దిలేశ్వర్ కమాయిత్, ఆర్జేడీ నుంచి అభయ్ కుష్వాహా, తృణమూల్ నుంచి కల్యాణ్ బెనర్జీ, శివసేన…