Editor

National

అరవింద్ కేజ్రీవాల్ పై దాడి..! ముఖంపై లిక్విడ్‌‌ పోసిన దుండగుడు..

దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో పర్యటిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి యత్నం జరిగింది. ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న కేజ్రీవాల్ పైకి దూసుకువచ్చిన ఓ వ్యక్తి… కేజ్రీవాల్ పై తన చేతిలోని ద్రవాన్ని విసిరారు. దాంతో అప్రమత్తమైన ఆయన భద్రతా సిబ్బంది.. వెంటనే ఆ యువకుడిని అక్కడి నుంచి లాగేశారు.   దాడికి ప్రయత్నించిన యువకుడిని పట్టుకున్న పార్టీ కార్యకర్తలు…

TELANGANA

రైతుల‌కు గుడ్ న్యూస్.. నాలుగో విడుత రుణమాఫీ.. రూ.2747.67 కోట్లు విడుదల..!

రెండు ల‌క్ష‌లు రుణం తీసుకుని మాఫీ కాని రైతుల‌కు మ‌హబూబ్ న‌గ‌ర్ రైతు పండుగ స‌భ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధుల‌ను విడుదల చేశారు. రుణ‌మాఫీలో నెల‌కొన్న టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి నిధుల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రుణ‌మాఫీ జ‌ర‌గ‌ని 3.14 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల‌లోకి ఈ నిధులు జ‌మ అవుతాయ‌ని చెప్పారు.   ఇదిలా ఉంటే…

AP

మాజీ మంత్రి రోజాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత సంఘాలు..!

మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజాపై దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక బీచ్ లో దళిత ఉద్యోగితో చెప్పులు మోయించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.   వివరాల్లోకి వెళితే… 2023 ఫిబ్రవరిలో సూర్యలంక బీచ్ కు పర్యాటక మంత్రిగా ఉన్న రోజా వెళ్లారు.…

CINEMA

అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చుని అదే పని చేస్తా.: రాంగోపాల్ వర్మ..

అజ్ఞాతంలో ఉన్న‌ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం ఆయ‌న ఒక వీడియో విడుద‌ల చేశారు. తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డటం లేద‌ని, సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండ‌డంతోనే పోలీసుల విచార‌ణ‌కు రావ‌డంలేద‌ని వివ‌రించారు.   తాజాగా మ‌రోసారి ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న కోసం పోలీసులు వెత‌క‌డంపై ఆర్‌జీవీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎక్కడికి పారిపోలేద‌న్నారు. ఒక‌వేళ త‌న‌ను పోలీసులు…

AP

అమరావతికి రైల్వే లైన్..!

అమరావతి రైల్వే లైన్ వెళ్లే పలు గ్రామాల రైతులు, స్థానిక ఎమ్మెల్యేలతో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ భేటీ అయ్యారు. రైల్వే లైన్ కోసం భూసేకరణ కింద కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకోవాలని మంత్రిని రైతులు ఈ సందర్భంగా కోరినట్లు తెలుస్తోంది.   రాజధానిని ఆనుకుని ఉన్న గ్రామాలు కావడంతో తమకూ పూలింగ్ అవకాశం ఇవ్వాలని రైతులు కోరారు. అయితే, సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వారికి తెలిపారు. రైతులకు…

National

ఢిల్లీలో భారీ పేలుడు క‌ల‌క‌లం..!

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉద‌యం భారీ పేలుడు సంభవించింది. ప్రశాంత్‌ విహార్‌ ప్రాంతంలోని పీవీఆర్ మల్టీప్లెక్స్‌ సమీపంలోని ఓ స్వీట్‌ షాప్‌లో ఈ ఘటన జ‌రిగింది. గురువారం ఉదయం 11:48 గంటల సమయంలో స్వీట్‌ షాప్‌ వద్ద పేలుడు సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది.   దాంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంట‌నే ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాప‌క సిబ్బంది ఫైర్ ఇంజిన్ల‌తో మంట‌ల‌ను అదుపులోకి తెచ్చాయి. ఇక‌ రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్…

TELANGANA

గురుకులాలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్..

గురుకులాలు, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇటీవల గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగు చూశాయి. ఈ ఫుడ్ పాయిజన్‌‌కు గల కారణాలను టాస్క్‌ఫోర్స్ తేల్చనుంది.   ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలను తేల్చి, బాధ్యులను గుర్తించనుంది.  …

AP

డ్రగ్స్ నియంత్రణకు ‘ఈగల్’ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ నియంత్రణకు ‘ఈగల్‌’ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈగల్‌కు సంబంధించి అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.   డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాఫ్తు చేయనుంది. ఈగల్ కోసం సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈగల్ ఫోర్స్‌లో చేరిన వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.   అలాగే, డ్రగ్స్ కేసుల…

TELANGANA

పార్లమెంట్ లో తొలిసారి మూసీ రివర్ ఫ్రంట్ ప్రస్తావన…

హైదరాబాద్ మహానగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న మూసీ నదీ ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని… దేశ పార్లమెంట్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తెలిసింది. రాజ్యసభలో చర్య సందర్భంగా ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గురించి ప్రస్తావన రాగా ఆయా విషయాలపై రాష్ట్ర ప్రభుత్వ సమాచారాన్ని కేంద్ర మంత్రి టోకెన్ సాహు సభలో వెల్లడించారు.   పార్లమెంట్ లో తొలిసారి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు గురించి ప్రస్తావన రాగా.. రాష్ట్రానికి ఎంతో…

TELANGANA

ఇథనాల్‌ ఫ్యాక్టరీ ప‌నుల‌కు బ్రేక్.. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఇచ్చిన‌ అనుమ‌తుల‌పై పున‌రాలోచ‌న‌..

నిర్మ‌ల్ జిల్లా దిలావ‌ర్ పూర్ ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం స్పందించింది. గ‌త ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ‌కు ఇచ్చిన అనుమ‌తుల‌పై పునరాలోచిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ హ‌యాంలో ఇథ‌నాల్ ప‌రిశ్ర‌మ‌కు అనుమతులు ఇచ్చారు. అయితే ఇథ‌నాల్ ప‌రిశ్ర‌మ ర‌ద్దు చేయాల‌ని గ్రామ‌స్తులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. నిన్న మ‌ధ్యాహ్నం ఆర్డీవో ర‌త్న‌కుమారిని నిర్భందించి, ఆమె కారును ధ్వంసం చేశారు.   ఈ నేపథ్యంలో కొంద‌రు ఆందోళ‌న‌కారుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో పోలీసు వాహ‌నాలను…