నకిలీ వైద్యులపై వేటు వేసిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్..!
తెలంగాణలోని పలు నగరాలు, పట్టణాల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ తరహా వైద్యులు పుట్టుకొస్తున్నారు. అర్హత లేకున్నా నకిలీ ధ్రువపత్రాలతో వైద్యులుగా చలామణి అవుతూ ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు ఆసుపత్రుల్లో కొంతకాలం సహాయకులుగా పనిచేసి, ఆ తరువాత వైద్యులుగా అవతారమెత్తుతున్నారు. ఎలాంటి అర్హత లేకుండానే రోగులకు యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్ వంటి మందులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అర్హత లేని వైద్యుడు, అనుమతులు లేని ఆసుపత్రిలో ఓ మహిళకు శస్త్రచికిత్స చేయగా, వైద్యం వికటించి…

