రేపే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్… భారత్ vs న్యూజిలాండ్..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మ్యాచ్ జరిగే పిచ్ ఎలా ఉండబోతోందన్న దానిపై రెండుమూడు రోజులుగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా, దీనిపై ఒక స్పష్టత వచ్చేసింది. ‘బ్రాండ్ న్యూ’ పిచ్‌పై కాకుండా ‘సెమీ-ప్రెష్’ పిచ్‌ను సిద్ధం చేసినట్టు తెలిసింది. రెండువారాల క్రితం అంటే ఫిబ్రవరి 23న ఈ పిచ్‌ను గ్రూప్ స్టేజ్‌లో…

