Editor

AP

జూన్ 4న వెన్నుపోటు దినం విజయవంతం చేయాలంటూ సజ్జల కామెంట్స్..!

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధినేత చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతోంది. 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా, జూన్ 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చలేదని వైకాపా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీని ‘వెన్నుపోటు దినం’గా నిర్వహించాలని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి…

TELANGANA

మూడోసారి కేసీఆర్‌తో హరీష్ భేటీ..! కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చర్చ..?

కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో ముచ్చటగా పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు హరీష్‌రావు. ఇరువురు మధ్య చాలా అంశాలు చర్చకు వచ్చాయి. కాకపోతే తొలుత కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చించారట. ఆ తర్వాత పార్టీ సంక్షోభం గురించి మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి.   కాళేశ్వరం కమిషన్ నోటీసుల తర్వాత కేసీఆర్‌తో హరీష్‌రావు మూడోసారి భేటీ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఇరువురు నేతల మధ్య సమావేశం జరిగింది. కమిషన్ ముందు హాజరవుతానని మంగళవారం సాయంత్రం…

National

భారత్ సొంత స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్..!

భారత రక్షణ రంగం మరో కీలక ముందడుగు వేసింది. దేశీయంగానే అత్యాధునిక ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారు చేసుకునే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదముద్ర వేశారు. చైనా తన వైమానిక శక్తిని వేగంగా విస్తరించుకోవడమే కాకుండా, పాకిస్థాన్‌కు కూడా అత్యాధునిక యుద్ధ విమానాలను అందించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.   ఈ సరికొత్త యుద్ధ విమానం రెండు ఇంజన్లతో, ఐదో తరం (ఫిఫ్త్…

AP

ఎన్టీఆర్ జయంతి ఇకపై రాష్ట్ర పండుగ.. ప్రభుత్వ అధికారిక ప్రకటన..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ప్రతి సంవత్సరం మే 28న ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   ఎన్టీఆర్ రాష్ట్రానికి అందించిన సేవలను ఈ సందర్భంగా ప్రభుత్వం గుర్తుచేసుకుంది. ఆయన అసాధారణమైన జీవితం, దూరదృష్టితో కూడిన నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌పై చెరగని ప్రభావం చూపాయని కొనియాడింది.…

TELANGANA

రాజీవ్ యువ వికాసం పథకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..

తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం అమలు తీరుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకం ద్వారా యువతకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వేగవంతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.   సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన మంజూరు పత్రాలను జూన్ 2వ తేదీ…

AP

జూన్ 9 నుంచి వైఎస్ షర్మిల రాష్ట్ర పర్యటన..

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను కలుపుతూ విస్తృత పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడంతో పాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు.   22 రోజులపాటు పర్యటన వైఎస్ షర్మిల చేపట్టనున్న ఈ రాష్ట్రస్థాయి పర్యటన…

TELANGANA

జగిత్యాల కోర్టు నుంచి పరారైన రిమాండ్ ఖైదీ..

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోర్టు ఆవరణలో నిన్న అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొచ్చిన ఓ రిమాండ్ ఖైదీ, పోలీసుల కళ్లుగప్పి చాకచక్యంగా పరారయ్యాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు నటిస్తూ, కాపలా ఉన్న కానిస్టేబుల్ దృష్టి మరలిన క్షణంలో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో పాటు, పోలీసుల భద్రతా వైఫల్యంపై చర్చకు దారితీసింది.వివరాల్లోకి వెళితే, పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్ అనే…

National

సీఆర్పీఎఫ్ జవాన్ గూఢచర్యం కలకలం.. ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..!

దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై)ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. మోతీరామ్ జాట్ అనే ఈ జవాను పహల్గామ్‌లో ఉగ్రదాడికి ఆరు రోజుల ముందు వరకూ అక్కడే విధులు నిర్వర్తించాడు.   అధికారల కథనం ప్రకారం.. మోతీ రామ్ జాట్ 2023 నుంచి పాకిస్థాన్ గూఢచార సంస్థలకు సున్నితమైన సమాచారాన్ని అందిస్తున్నాడు. అతడి…

TELANGANA

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు… తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ నోటీసులను ఆమె తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగంగానే కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు వచ్చాయని అర్థమవుతోందని అన్నారు. తమ పార్టీ నాయకులను…

AP

ఏపీలో కరోనా వ్యాప్తి… కొత్తగా మరో మూడు కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మూడు కొత్త పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మూడు కేసుల్లో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు, తెనాలికి చెందిన ఒక వృద్ధుడు ఉన్నారు. వీరికి తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం కరోనా సోకిన వృద్ధుడి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో, వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.…