వక్ఫ్ సవరణ బిల్లు-2025పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, మజ్లిస్..
వక్ఫ్ (సవరణ) బిల్లు-2025ను సవాల్ చేస్తూ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 ఆమోదం పొందిన విషయం విదితమే. ఈ బిల్లును కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ బిల్లు (సవరణ) లోని నిబంధనలు ముస్లిం సమాజం యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం…

