స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధం..! త్వరలోనే నోటిఫికేషన్..!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రేపోమాపో గంట మోగనుంది. దీనికి సంబంధించి పనులు తెరవెనుక వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలను ఖరారు చేసింది. వాటిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు గంట మోగనుంది. రాష్ట్రంలో 566 జడ్పీటీసీ సీట్లు, 5,773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీల సంఖ్య 12,778 కాగా, వార్డుల సంఖ్య…

