Editor

TELANGANA

తెలంగాణలో గ్రూప్ -1 ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణలో గ్రూప్ -1 ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. గ్రూప్ -1 పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో గ్రూపు – 1 మెయిన్స్ పరీక్షలు గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 563 పోస్టులకు గాను 31,403 (క్రీడల కోటా కలిపి) మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు.   అయితే, జీవో నెం.29ని రద్దు చేయాలని, గ్రూప్ -1 మెయిన్స్…

TELANGANA

హైదరాబాద్ కి బుల్లెట్ రైలు.. ఎప్పుడంటే..?

హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైలు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్-ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే నిర్ణయించింది. ఈ కారిడార్‌ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది. దీంతోపాటు మైసూరు-చెన్నై మధ్య నిర్మించ తలపెట్టిన హైస్పీడ్ రైలు కారిడార్‌ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని యోచిస్తోంది. అదే జరిగితే హైదరాబాద్ నుంచి ముంబై,…

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డికి మంద కృష్ణ అల్టిమేటం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వర్గీకరణ అంశంపై అల్టిమేటం జారీ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న లక్ష డప్పులు, వేల గొంతుల సన్నాహక సమావేశం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాలులో శుక్రవారం జరిగింది.   ఈ సమావేశంలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం మొదలవుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీపై కట్టుబడి ఉంటే ఈ నెల 7వ…

AP

వైసీపీకి కోలుకోలేని దెబ్బ..? పార్టీలో స్తబ్ధత..?

గత ఎన్నికల్లో ఘోర ఓటమి. కుదురుకునే లోపు ఒక్కొక్కరుగా నేతల జంప్‌. నా అనుకున్న వారు దూరం కావటంతో వైసీపీ అధినేత జగన్‌.. ఆలోచనలో పడ్డారట. కీలకనేతల రాజీనామాలతో.. పార్టీలో స్తబ్ధత నెలకొందట. వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమని క్యాడర్‌కు భరోసా ఇస్తుంటే.. పార్టీ నడిపించటంలో తనకు తోడుగా ఉన్న ప్రముఖులు వీడటంతో వైసీపీ అధినేత ఇరకాటంలో పడ్డారట. విదేశీ పర్యటన ముగించుకుని.. స్వదేశానికి తిరిగొచ్చిన ఫ్యాన్ పార్టీ అధినేత.. రూట్‌ మ్యాప్ ఏంటనే చర్చ జోరుగా…

National

కేంద్ర బడ్జెట్ 2025-26.. రైతులకు సహాయం, ఆరోగ్య బీమా, విద్యారంగంలో ఏఐ వినియోగం మరెన్నో..

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలలో భాగంగా.. వివిధ రంగాలలో అనేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు సహాయం అందించడం, సామాన్యులకు ప్రయోజనం కలిగించడం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రధాన అంశాలలో అభివృద్ధిని కేంద్రీకరించడం జరిగింది. ఈ బడ్జెట్‌లోని ముఖ్యమైన పథకాలు, నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.   * KCC ద్వారా లోన్ల పెంపు: కిసాన్ క్రెడిట్…

TELANGANA

నమ్మి ఓటేస్తే ప్రజలను నట్టేటా ముంచారు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ సీఎం కేసీఆర్ వార్నింగ్..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్నానని.. గంభీరంగా చూస్తున్నానని.. నేను కొడితే మామూలుగా ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుతామన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని..నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చిందని అన్నారు. చెప్పినా ప్రజలు వినలేదని…అత్యాశకు…

AP

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ విలువల సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి…

AP

వివేకా కేసులో సునీత సంచలన నిర్ణయం..!

వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా కుమార్తె సునీత మరోసారి హై కోర్టు లో పిటీషన్ దాఖలు చేసారు. తాజా పిటీషన్ లో కీలక అంశాలు ప్రస్తావించారు. కేసు విచారణలో జాప్యం పైన హైకోర్టుకు వివరించారు. కేసు విచారణ వేళ చోటు చేసుకుంటున్న పరిణామాలను తన పిటీషన్ లో పేర్కొన్నారు. సీబీఐ కోర్టులో కేసు విచారణ ఆరు నెలల సమయంలో పూర్తయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సునీత అభ్యర్ధించారు.   తెలంగాణ హైకోర్టులో వివేకా…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో విస్తుగొలిపే విషయాలు..18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా..

ఫోన్ ట్యాపింగ్‌ కేసు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ హైకోర్టులో పని చేసిన 18 మంది న్యాయమూర్తుల డీటైల్స్.. ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్‌లో ఉన్నట్టు తేలింది. అందులో ఐదుగురు మహిళా న్యాయమూర్తుల సమాచారమూ ఉంది. ఫోన్‌ ట్యాపింగ్‌పై తెలంగాణ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు టీంపై ఇదివరకే కేసు నమోదైంది.   హైదరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో నిందితుల నుంచి…

TELANGANA

తెలంగాణలో ప్రాణాంతక జిబిఎస్ వ్యాధి.. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదు..

దేశంలో గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా జిబిఎస్ కేసులు పెరుగుతున్నందున ఆందోళన వ్యాపిస్తోంది. తాజాగా తెలంగాణలో తొలి GBS కేసు నమోదైంది. హైదరాబాద్‌లో గులియన్-బారే సిండ్రోమ్ కేసును వైద్యులు గుర్తించారు. సిద్దిపేటకు చెందిన ఒక మహిళకు GBS లక్షణాలు కనిపించడంతో, ఆమెను హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో GBS కారణంగా గత నాలుగు రోజుల్లో ఒక చిన్నారితో సహా ముగ్గురు మరణించారు. మరోవైపు, మహారాష్ట్రలోని పుణేలో దాదాపు 130 జిబిఎస్…