రైలు పట్టాలపై పడుకోబెడతా.. వారికి ఎమ్మెల్యే గుమ్మనూరు వార్నింగ్..
తనపై కొందరు మీడియా ప్రతినిధులు తప్పుడు ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తున్నారని మాజీ మంత్రి, గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. నిరూపించే దమ్ము ఉంటేనే వార్తలు రాయాలని… నిరూపించలేకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ఎవడో డబ్బులు ఇస్తాడని తప్పుడు వార్తలు రాస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను భూకబ్జాలకు పాల్పడ్డానని, నియోజకవర్గంలో తన కుటుంబ పెత్తనం ఉందంటూ కొందరు తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని… వారంతా పద్ధతి మార్చుకోవాలని అన్నారు.…

