Editor

National

ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!

రూ.2 వేల రూపాయల నోట్ల విషయంలో రిజర్వు బ్యాంక్ మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఆర్ధిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగియనుండటం, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1న రూ.2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు కానీ, డిపాజిట్ చేసేందుకు కానీ అనుమతించరాదని నిర్ణయించింది.   ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 19 చోట్ల ఉన్న బ్రాంచ్…

TELANGANA

అష్టదిగ్బంధనం – బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గులాబీ అధినేత రాజకీయంగా వరుస ఎదురు దెబ్బలు తింటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ వెంట నడిచిన సీనియర్లు కాంగ్రెస్ బాట పట్టారు. దీంతో, గులాబీ పార్టీ కుదేలవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు.   వరుస షాక్ లతో బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు.…

TELANGANA

జైల్లో చిప్పకూడే.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై తొలిసారి స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం గాంధీభవన్‌లో వాల్మీకి, బోయలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ ముగియగానే వాల్మీకి, బోయల డిమాండ్లు నెరవేరుస్తామన్నారు. గద్వాల్, ఆలంపూర్ ప్రాంతంలోని బోయల గురించి తనకు తెలుసన్నారు. ఇప్పుడు అందరూ ఒకవైపు రండి.. మన ప్రభుత్వం ఉందన్నారు.   ఢిల్లీలో కూడా మన పరిపాలనను అభినందిస్తున్నారని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఎవరు ఏ…

AP

వాలంటీర్ వ్యవస్థ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఇప్పటికే సీఎం జగన్, చంద్రబాబు వరుస పర్యటనలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం ప్రారంభిస్తున్నారు. కూటమి నుంచి అభ్యర్దుల ఎంపిక దాదాపు పూర్తయింది. దీంతో..ఇక ప్రచారం..మేనిఫెస్టో పైన పార్టీలు ఫోకస్ చేసాయి. జగన్..చంద్రబాబు ఇద్దరూ ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ప్రచారంలో ఉన్నారు. జగన్ సీఎం లక్ష్యంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.   కొనసాగిస్తాం టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థ పైన కీలక…

AP

జెండాలు జత కట్టడమే వారి ఏజెండా – సీఎం జగన్..

వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ‘మేమంత సిద్ధం’ పేరిట జగన్ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఎమ్మిగనూరు సహా పలు ప్రాంతాల్లో బస్సు యాత్ర చేపట్టారాయన.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఇక సాయంత్రం ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో జగన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.   రైతన్నలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ‎నే అని అన్నారు. ప్రతి అక్కాచెల్లెమ్మ గుర్తుపెట్టుకోండి.. ఈ…

National

ఈసారి ఎన్నికల సిబ్బందికి ఈసీ చెల్లించే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఏప్రిల్ 19తో మొదలుపెట్టి జూన్ 1 వరకూ ఏడు విడతల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పటికే లోక్ సభకు తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల సిబ్బందికి చెల్లించే రెమ్యునరేషన్లను ఈసీ తాజాగా ఖరారు చేసింది.…

TELANGANA

రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్‌పై కేసు నమోదు ..

చెంగిచెర్లలో ఇటీవల జరిగిన ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా, గురువారం గోషామహల్బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ను పోలీసులు హౌస్అరెస్టు చేశారు. అయితే, పోలీసుల తీరుపై రాజా సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంగిచెర్లకు బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే.. తనను అడ్డుకుని హౌస్అరెస్టు చేశారని రాజాసింగ్మండిపడ్డారు.   పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజా సింగ్ ధ్వజమెత్తారు. హోలీ పండుగ రోజు చెంగిచెర్లలో హిందువులపై దాడి జరిగిందని, చాలా మంది మహిళలు, యువత గాయపడ్డారని రాజాసింగ్…

TELANGANA

కేసీఆర్‌కు మరో షాక్.. బీఆర్ఎస్‌కు కడియం శ్రీహరి, కావ్య గుడ్‌బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో..

కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఎంపీ కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి. తాజాగా, మరో బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు.   తాను వరంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కావ్య లేఖ రాశారు. బీఆర్ఎస్ నుంచి పోటీకి…

AP

జగన్‌కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు..

సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడటంతో వైసీపీ నేతలు, కౌన్సిలర్లపై ప్రతిపక్షాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. దీనిలో భాగంగానే నందిగామ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు ఇప్పటికే టీడీపీ గూటికి చేరారు. కేశినేని చిన్ని సమక్షంలో వీరు టీడీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నపిఠాపురం నియోజకవర్గంలో 8 మంది వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది.…

AP

జగన్ కామెంట్స్ కు సునీత కౌంటర్- మళ్లీ సానుభూతి డ్రామా-ఓటేయొద్దని పిలుపు..!

ఏపీలో ఎన్నికల వేళ మరోసారి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం తెరపైకి వస్తోంది. ఐదేళ్లుగా అధికారంలో ఉన్నా వివేకా హత్యను కొలిక్కి తీసుకురాలేకపోయారని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం వైఎస్ జగన్ నిన్న ప్రొద్దుటూరులో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముఖ్యంగా వివేకా హత్యలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకుని ప్రచారం చేస్తూ వివేకా హంతకులు బయటే తిరుగుతున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.   జగన్ కామెంట్స్ పై ఇవాళ…