తెలంగాణ తల్లికి కొత్త రూపం.. విగ్రహం ప్రత్యేకతలు ఇవే, ఈ నెల 9న ఆవిష్కరణ..
పచ్చచీర గట్టి, కంకి చేతబట్టి అభయహస్తంబు చూబుతూ పిడికిలి గురుతులున్న పాదపీఠంబెక్కి నిండు ముత్తయిదువోలె కనులపండువలా కనిపిస్తోంది తల్లీ తెలంగాణ. తల్లీ నీకివే మా పాదాభివందనాలంటూ.. అందరూ చేతులెత్తి మొక్కేలా ఉంది తెలంగాణ తల్లి విగ్రహం. సరికొత్త తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ…

