Editor

National

వికసిత్‌ భారత్‌ టార్గెట్‌ 2047..

ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ అన్నారు. గురువారం (ఫిబ్రవరి 1న) లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2024–25పై మాట్లాడారు. దేశంలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేశామని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర పెంచుతూ వచ్చామని తెలిపారు. యువత ఉపాధికి పెద్దపీట వేశాన్నారు. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

AP

వైసీపీ ఆరో జాబితా విడుదల..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అయిదు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 75 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించింది.   ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. కొన్నిచోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను…

AP

హాట్ సీట్ మైలవరం వైసీపీ అభ్యర్థిగా..!!

కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ఖాయం చేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సిట్టింగ్ శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్‌కు ఈ సారి టికెట్ ఇవ్వట్లేదు. ఆయనకు బదులుగా మరో అభ్యర్థిని తెరమీదికి తీసుకొచ్చింది పార్టీ అగ్రనాయకత్వం.   వసంత కృష్ణ ప్రసాద్.. కొంతకాలంగా పార్టీపై వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి- పెడన ఎమ్మెల్యే, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌తో ఆయనకు విభేదాలు ఉన్నాయి. వీటిని…

TELANGANA

4న తెలంగాణ కేబినెట్ భేటీ..

తెలంగాణలో కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. ప్రధానంగా బడ్జెట్, గవర్నర్ ప్రసంగంపై చర్చించేందుకు ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఫిబ్రవరి 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.   ఫిబ్రవరి 8న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.…

TELANGANA

త్వరలో రేవంత్ మార్క్ బడ్జెట్.. అన్ని నియోజకవర్గాలకు గుడ్ న్యూస్..!!

ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుండి తెలంగాణా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారని సమాచారం. అయితే ఈసారి తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న బడ్జెట్ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అది రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.   ఈ క్రమంలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో…

AP

నాకు టికెట్ ఇవ్వకుంటే వాళ్ళు ఉరేసుకుంటారు..బెదిరిస్తున్న టీడీపీ నేత!!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ల కోసం అన్ని పార్టీలలోనూ ఆశావహుల సమరం కొనసాగుతుంది. ఇప్పటికే వైసీపీలో టిక్కెట్లు దక్కవని భావిస్తున్న వారు టీడీపీ, జనసేన పార్టీలలో చేరుతున్నారు. దీంతో ఏపీలో వలసల పర్వం కొనసాగుతుంది.   ఇదిలా ఉంటే ఇక టీడీపీలోనూ టీడీపీ, జనసేన పొత్తుల నేపధ్యంలో చిచ్చు రగులుకుంది. జనసేన ఆశిస్తున్న స్థానాలలో టీడీపీ నుండి ఆశావహులు టికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో…

TELANGANA

తెలుగు రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్టులు, కేటాయింపులు..!

కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇందులో ప్రస్తావించిన అంశాలు, కేటాయింపుల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల సమయం లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలోనే రైల్వే బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు చేసిన కేటాయింపుల పైన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. గతం కంటే అంచనాలు పెరిగినట్లు వెల్లడించారు.   ఎన్నికల ఏడాది కావటంతో నిర్మలా…

AP

ఢిల్లీ కేంద్రంగా నేడు వైయస్ షర్మిలా దీక్ష..!

వైఎస్ షర్మిల ఏ పని చేసినా ఆచి తూచి అడుగేస్తారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఏపీలో ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చి, వచ్చే ఎన్నికల్లో బలంగా బరిలో నిలిచేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో జనం నాడిని పట్టుకోవటానికి ఆమె ప్రయత్నాలు సాగిస్తున్నారు.   ఏపీ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాన్ని…

TELANGANA

ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి.. తొలిసారి ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్!!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు అసెంబ్లీలో గజ్వేల్ శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల తుంటి శస్త్ర చికిత్స జరిగిన ఆయన చేతి కర్ర సహాయంతో తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ అసెంబ్లీ వద్ద కేసీఆర్ కు స్వాగతం పలికారు. ఆపై కెసిఆర్ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు చేరుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కెసిఆర్ తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత…

TELANGANA

అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక, ఎందుకంటే..?

ప్రజలను ఇబ్బంది పెట్టి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని అన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.   గురువారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల సమీక్ష జరుగుతుండగా ఈ అంశం చర్చకు…