డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు..
రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు అందించే ప్రతీ సేవను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని సేవలను ‘మన మిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకువస్తే, ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నాడు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) పనితీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష…

