కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుంది: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
జనగామలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేవలం ఒక ప్రెస్ మీట్ పెడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోయిందని, ఆయన గనుక అసెంబ్లీలోకి అడుగుపెడితే రేవంత్ రెడ్డి తట్టుకోలేరని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ‘మొనగాడు’ కేసీఆర్ అని, ఆయన సత్తా ఏంటో అసెంబ్లీలో చూపిస్తారని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘420 హామీల’ను నమ్మి ప్రజలు ఓటేశారని,…

