రామోజీరావు లాంటి 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు: ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రామోజీ ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రామోజీరావును ‘అక్షర యోధుడు’ అని కొనియాడారు, తెలుగుజాతి గర్వించదగిన రామోజీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డులు అత్యున్నత స్థాయికి చేరుతాయని ఆకాంక్షించారు. రామోజీరావు నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా నిలిచి ఉంటాయన్నారు. ముఖ్యంగా, నమ్మిన సిద్ధాంతం కోసం రామోజీ దేన్నైనా వదులుకున్నారని, తన జీవితంలో ఫలానా పని చేసిపెట్టాలని ఆయన ఎవరినీ అడగలేదని…

