హైదరాబాద్‌లో దారుణం: చట్నీ పడిందన్న కోపంతో వ్యక్తిని హత్య చేసిన నలుగురు యువకులు
హైదరాబాద్ శివారులోని ఉప్పల్, కల్యాణపురిలో నివసించే మురళీ కృష్ణ (45) అనే వ్యక్తిని కేవలం దుస్తులపై చట్నీ పడేశాడన్న చిన్న కారణంతో నలుగురు యువకులు దారుణంగా హత్య చేశారు. రాత్రి పనిమీద ఎల్బీనగర్ వెళ్లిన మురళీ కృష్ణ, ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఉప్పల్ వైపు వెళ్తున్న కారులోని యువకులను లిఫ్ట్ అడిగాడు. వారు అతడిని ఎక్కించుకున్నారు. ఉప్పల్‌లోని ఒక టిఫిన్ సెంటర్ వద్ద అందరూ కలిసి ఇడ్లీ, బోండాలు తింటున్న సమయంలో, మురళీ కృష్ణ ప్లేట్‌లోని…

