Editor

TELANGANA

ఈ నెల 22న చత్తీస్‌ గఢ్‌ ‌కు మంత్రి ఉత్తమ్‌, సీఎం శ్రీ విష్ణుతో భేటీ.. ఎందుకంటే..?

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ నెల 22న ఛత్తీస్‌ గఢ్‌ కు ‌వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయితో సమావేశం కానున్నారు. సమ్మక్క సారక్క సాగర్‌ ప్రాజెక్టుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(NOC) ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నీటిపారుదల ప్రణాళికతోపాటు పలు అంశాలను నివృత్తి చేసుకునేందుకు కేంద్ర జలవనరుల సంఘం (CWC) 23న తెలంగాణ అధికారులతో సమావేశం కానుంది. ఈలోగా NOC తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.   చత్తీస్…

AP

ఏపీలో నో ప్లాస్టిక్..! సర్కార్ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్‌ ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోబోతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టేందుకు త్వరలోనే పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించబోతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి శాసనసభలో అడిగిన ప్రశ్నకు ఆయన కీలక సమాధానం చెప్పారు. వాస్తవానికి రాష్ట్రంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికీ, గ్రౌండ్ లెవల్ లో అది సరిగా అమలు కావడం లేదన్నారు.   ప్లాస్టిక్…

CINEMA

పవన్ కల్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్..! ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా నుంచి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 21వ తేదీన ఉదయం 10:08 గంటలకు ‘ఓజీ’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.   ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ అభిమానుల సందడి…

TELANGANA

రేవంత్ రెడ్డితో బ్రిటన్ హైకమిషనర్ భేటీ.. తెలంగాణ విద్యార్థులకు యూకే స్కాలర్‌షిప్స్‌కు అంగీకారం..

తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. యూకే ప్రభుత్వం అందించే ‘చెవెనింగ్ స్కాలర్‌షిప్స్‌’ను రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేయడానికి బ్రిటన్ అంగీకారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో భారత బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ ఈ హామీ ఇచ్చారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. కో-ఫండింగ్ ప్రాతిపదికన ఈ స్కాలర్‌షిప్స్‌లను అందించడానికి ఆమె సుముఖత వ్యక్తం చేశారు.  …

TELANGANA

సిరిసిల్ల కలెక్టర్‌కు డబుల్ షాక్: ప్రోటోకాల్ వివాదంలో నోటీసు, కోర్టు ధిక్కరణ కేసులో వారెంట్..!

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వరుస వివాదాలతో వార్తల్లో నిలిచారు. ఒకే రోజు అటు ప్రభుత్వం నుంచి, ఇటు హైకోర్టు నుంచి ప్రతికూల చర్యలు ఎదుర్కోవడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రోటోకాల్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయగా, కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు వారెంట్ జారీ చేసింది.   వివరాల్లోకి వెళితే, నిన్న జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి…

National

అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారు: మంత్రి సీతక్క..

తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌పై బురద చల్లుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు. రైతుల సమస్యల విషయంలో కేంద్రం బాధ్యతను పక్కనపెట్టి, రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని ఆమె హితవు పలికారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో పర్యటించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.   యూరియా సరఫరా అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేశారు.…

AP

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఆర్‌ఐ, సర్వేయర్..

వనపర్తి జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.   వివరాల్లోకి వెళితే, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) సి. వాసు, మండల సర్వేయర్ నవీన్ రెడ్డి ఓ వ్యక్తి నుంచి రూ.40,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి తన బంధువులకు చెందిన భూమికి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ జారీ చేయాలని…

TELANGANA

కేటీఆర్ ఒక చవట.. మేడిపల్లి సత్యం తీవ్ర వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత చెల్లెలు కవిత మాటలకే జవాబు చెప్పలేని కేటీఆర్ ఒక ‘చవట దద్దమ్మ’ అంటూ ఘాటుగా విమర్శించారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ రాష్ట్రానికి పట్టిన శని అని, ఆయన నోటి నుంచి అపశకునం మాటలు తప్ప మంచి రాదని అన్నారు.   ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కేటీఆర్ చూస్తున్నారని మేడిపల్లి సత్యం…

CINEMA

ఓటీటీలోకి ‘మహావతార్ నరసింహ’ సినిమా..! ఎప్పుడంటే..?

‘మహావతార్ నరసింహ’ చిత్రం ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా తెలుగుతో పాటు పలు భాషల్లో ‘నెట్ ఫ్లిక్స్’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 12:30 గంటలకు సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటన వెలువడింది.   శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. ‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని దాదాపు రూ. 40 కోట్ల వ్యయంతో నిర్మించారు. విడుదలైన…

AP

ప్రతిపక్ష హోదా అడుగుతున్న పార్టీ సంస్కరణలను స్వాగతించలేని దుస్థితిలో ఉంది: సీఎం చంద్రబాబు..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో తరం జీఎస్టీ (జీఎస్టీ 2.0) సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంస్కరణలను స్వాగతిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో, దేశంలోనే జీఎస్టీ 2.0ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తాయని, పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువస్తాయని ముఖ్యమంత్రి…