హైదరాబాద్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం..! కరెంట్ షాక్ తో ఐదుగురు మృతి..
హైదరాబాద్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్ధరాత్రి రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఈ విషాద ఘటన జరిగింది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిన్న రాత్రి స్థానికంగా రథాన్ని ఊరేగించారు. అయితే, రథాన్ని లాగుతున్న వాహనం చెడిపోవడంతో దాన్ని పక్కకు నిలిపివేసిన యువకులు.. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దాంతో రథాన్ని లాగుతున్న…

