విమర్శించడం లేదంటూనే రేవంత్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఇటీవల తరచూ విరుచుకుపడుతూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సొంతపార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో గత రాత్రి నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ ‘పదవులూ మీకే.. పైసలూ మీకేనా?’ అని నిలదీశారు. వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు బిల్లు రావడం లేదని కాంట్రాక్టర్ పని చేయడం లేదని, ముఖ్యమంత్రి ఇస్తేనే ఆ బిల్లు వస్తుందని అన్నారు. కాబట్టే సీఎంను ప్రశ్నిస్తున్నానని,…

