కాకాణి కుమార్తె ఖాతాలోకి రూ.70 లక్షలు.. సిట్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి..!
సర్వేపల్లి జలాశయంలో గ్రావెల్ అక్రమ తవ్వకాల కేసులో సిట్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు విచారణలో అధికారులు కీలక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న నిరంజన్ రెడ్డి బ్యాంకు ఖాతా నుంచి కాకాణి కుమార్తె ఖాతాకు రూ.70 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించిన సిట్ అధికారులు, దీనిపై ఆయనను కూలంకషంగా ప్రశ్నించినట్లు సమాచారం. కృష్ణపట్నం పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ విచారణకు…

