కడప-రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు షురూ: వన్యప్రాణుల కోసం 4 భారీ వంతెనలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా, మూడేళ్లుగా ముందుకు సాగని కడప – రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనుల్లో కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్ట్ శేషాచలం అటవీ ప్రాంతం మీదుగా నిర్మించాల్సి ఉండటంతో పర్యావరణ అనుమతులలో జాప్యం జరిగింది. అయితే, కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో అనుమతులు మంజూరు చేయించుకోవడంతో, ప్రస్తుతం కడప-రాజంపేట రహదారి (మొదటి ప్యాకేజీ) పనులు ప్రారంభమయ్యాయి. కడప – రేణిగుంట జాతీయ రహదారి…

