News

CINEMA

మహానాడుకు రమ్మంటూ అన్నగారి పిలుపు..

తెలుగుదేశం పార్టీ తలపెట్టిన మహానాడు కార్యక్రమానికి తరలిరావాలంటూ అన్న ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఏఐ సాంకేతికతతో టీడీపీ ఈ వీడియోను సృష్టించి ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ నెల 27 నుంచి 29 వరకు కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలంటూ తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. ఈ పోస్టులో ఏఐ ద్వారా నందమూరి తారకరామారావు మాట్లాడినట్లు వీడియో సృష్టించారు.   ‘ప్రియమైన నా…

AP

పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాలపై మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు..

రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.   “ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో…

National

కొత్త టోల్ పాలసీ తీసుకువస్తున్న కేంద్రం..

జాతీయ రహదారులపై తరచూ ప్రయాణాలు చేస్తూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్‌లతో ఇబ్బందులు పడే వాహనదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఖర్చు తగ్గించేందుకు ఫాస్ట్ ట్యాగ్ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.   తాజా ప్రతిపాదనలో భాగంగా, వాహనదారులు త్వరలో రూ.3 వేల వార్షిక రుసుము చెల్లించే అవకాశం రావచ్చు. తద్వారా వారు ఏడాది పొడవునా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేలపై…

TELANGANA

కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు.. ఢిల్లీలోనే రేవంత్‌రెడ్డి..

తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై తుది నిర్ణయం తీసుకొనేందుకు అందుబాటులో ఉండాలంటూ అధిష్ఠానం పెద్దల నుంచి రేవంత్‌రెడ్డికి సమాచారం అందింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ హైదరాబాద్ తిరిగి చేరుకోవాల్సి ఉండగా, అధిష్ఠానం సూచన మేరకు హస్తినలోనే ఉండిపోయారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్‌రెడ్డి నేడు భేటీ కానున్నారు.   గత రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్…

AP

మాజీ మంత్రి కాకాణిని నెల్లూరుకు తీసుకువచ్చిన పోలీసులు .. నేడు కోర్టు ముందుకు..

క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నిన్న బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనను ఈరోజు వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరులో అరెస్టు చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు నెల్లూరుకు తీసుకువచ్చారు.   జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఆయన్ను ఉంచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడకు మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు. కిలోమీటరు దూరంలోనే అన్ని వాహనాలను నిలుపుదల చేస్తున్నారు.…

AP

వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అరెస్ట్..

ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కాకాణిని కేరళలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదు అయ్యింది.   అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డి ఏ4గా ఉన్నారు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా గత రెండు నెలల నుంచి ఆయన పరారీలో ఉన్నారు. కాకాణి గత వైసీీపీ ప్రభుత్వ…

TELANGANA

కవిత కొత్త పార్టీ..?

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. బీఆర్ఎస్ లో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించారు. ఈ తాజా పరిణామాల మధ్య కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అవ్వడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన సంచలన లేఖ వైరల్ అయిన తర్వాత కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు గంటన్నర సేపు వీరిద్దరి…

TELANGANA

మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ ఆరోపణలపై తెలంగాణ సర్కారు సీరియస్… విచారణకు ఆదేశం..

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తీరుపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన తీవ్ర ఆరోపణలు కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దేశ ప్రతిష్ఠతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.   మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు, కొందరు సంపన్న పురుష స్పాన్సర్లను అలరించాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని మిల్లా మాగీ ఆరోపించారు. ఈ…

National

రూ.840 కే నెలంతా అపరిమిత ఇంటర్నెట్ ఆఫర్ తో స్టార్ లింక్ ఎంట్రీ..!

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ సహా ప్రముఖ అంతర్జాతీయ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఆకర్షణీయమైన ప్రణాళికలు రచిస్తున్నాయి. వినియోగదారులను వేగంగా ఆకట్టుకునేందుకు, ప్రారంభంలో నెలకు రూ. 840 రూపాయలకే అపరిమిత డేటా ప్లాన్లను అందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంతో మధ్య, దీర్ఘకాలంలో సుమారు కోటి మంది వినియోగదారులను చేర్చుకోవాలన్నదే ఈ సంస్థల టార్గెట్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అధిక స్పెక్ట్రమ్ ఖర్చులను పెద్ద సంఖ్యలో యూజర్లతో భర్తీ చేసుకోవచ్చనే వ్యూహంతో మార్కెట్…

TELANGANA

ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు..!

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ఓ శుభవార్త అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు మేలు చేకూర్చే కొన్ని కీలక ప్రకటనలు చేయవచ్చని సమాచారం. ఈ ప్రకటనల్లో భాగంగా ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ కరువు భత్యం (డీఏ)లలో ఒకదానిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.   అంతేకాకుండా, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇతర బకాయిలు, పదవీ…