News

National

జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన విషయాలు..!

దేశ ద్రోహి,పాక్‌ గూఢచారి, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి మల్హోత్రా.. తన డైరీలో పాకిస్థాన్ టూర్ కు సంబంధించిన వివరాలను పేర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె పాకిస్థాన్ జర్నీ ఆహ్లాదకరంగా సాగిందని.. అక్కడ ఆతిథ్యం బాగుందని రాసుకొచ్చింది.   ఈ మేరకు జ్యోతి మల్హోత్రా.. తన డైరీలో పాకిస్థాన్ ను పొగుడుతూ రాసుకున్నట్లు పోలీసులు ఆమె డైరీని స్వాధీనం చేసుకుని పరిశీలించారు.…

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ..

తెలంగాణలో మినీ అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మినీ అంగన్‌వాడీలను పూర్తిస్థాయి అంగన్‌వాడీలుగా గుర్తించి, వారికి పెంచిన వేతనం పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు.   రాష్ట్రంలో పనిచేస్తున్న 3,989 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నిరుపేద వర్గాలకు అంకితభావంతో సేవలు…

TELANGANA

హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం.. నకిలీ పత్రాలతో..

హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తూ, నకిలీ పత్రాలతో భారత ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందిన మయన్మార్ దేశస్థుల ముఠా గుట్టు రట్టయింది. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం జరిపిన దాడుల్లో మయన్మార్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరు కొన్నేళ్ల క్రితం మయన్మార్ నుంచి అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించి, ఇక్కడ తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మదర్సాలో పనిచేసే కొందరు ఉపాధ్యాయుల పాత్ర…

AP

జగన్ 2.O వస్తది.. అప్పుడు ఒక్కొక్కరికి?: జగన్ సంచలన వ్యాఖ్యలు..

మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని.. జగన్ 2.Oలో కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.   ‘ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసు పెడుతున్నారు. వంశీ, నందిగం విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలను వేధిస్తున్న వారికి సినిమా చూపిస్తాం. రిటైరైనా, దేశం విడిచి వెళ్లినా రప్పిస్తాం. రాబోయే రోజుల్లో ప్రజల…

AP

జిల్లాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు..

జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మంత్రులతో జిల్లాల పునర్విభజనపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో పలు ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల ఏర్పాటుకు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.   ఈ నేపథ్యంలో, కూటమి ఇచ్చిన హామీలపై త్వరితగతిన నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలతో పాటు వివిధ సంఘాల వారిని భాగస్వాములను…

National

ఇండియాలో పెరుగుతున్న కరోనా జేఎన్.1 కేసులు… వ్యాధి లక్షణాలు ఇవే..!

దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు, వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటం గమనార్హం.ప్రస్తుతం మన దేశంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అయితే, హాంకాంగ్,…

TELANGANA

తెలంగాణలో 77 మంది డీఎస్పీల బదిలీలు.!

రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో సోమవారం భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డీజీపీ జితేందర్ కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 77 మంది డీఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను బదిలీ చేశారు. ఈ బదిలీల ప్రక్రియలో భాగంగా కొందరికి నూతన పోస్టింగులు కేటాయించగా, మరికొందరిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.   పోలీసు శాఖలో పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ఈ బదిలీల్లో పలువురు కీలక అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. జగిత్యాల సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్…

TELANGANA

కాళేశ్వరం దర్యాప్తులో కీలక ట్విస్ట్..! విచారణకు మాజీ సీఎం కేసీఆర్..?

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించిన (క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన) తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామం నేపథ్యంలో కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించింది.   వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో…

AP

ఏపీలోని ఆ జిల్లాల్లో ఉగ్ర కదలికలు..? సీఎస్, డీజీపీకి పవన్ లేఖలు..!

కేంద్రం పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఏపీలోని విజయనగరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. విజయనగరానికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వారు ఐసిస్ ఆదేశాలతో బాంబులు తయారు చేసినట్లు గుర్తించారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ ఘటనపై స్పందించారు. సీఎస్, డీజీపీలకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. ఇందులో పలు కీలక అంశాల్ని పవన్ ప్రస్తావించారు.   జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీలోని అన్ని జిల్లాల్లో…

AP

అరెస్టుల వేళ జగన్ వరుస భేటీలు..! కారణం అదేనా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమౌతున్నారు.   జగన్ 2.0 అంటూ గతంలో ప్రకటించారు జగన్. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తోన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోన్నారు. క్యాడర్‌లో…