News

TELANGANA

సీఈ రమణారెడ్డికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్..!

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో మహబూబ్‌నగర్‌ జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ (సీఈ) రమణారెడ్డికి సీఎం తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. “అక్కడ (గతంలో పనిచేసిన చోట) చేసినట్లు ఇక్కడ కూడా చేస్తే కేసు పెట్టి లోపల వేయిస్తా” అంటూ సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. రమణారెడ్డి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో…

AP

వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీసులు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీని హుటాహుటిన వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీసులు. జైలులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ విషయాన్ని న్యాయాధికారికి వంశీ వివరించారు. ఆక్సిజన్‌ ఎనలైజర్‌ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని చెప్పారు.   గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హుటాహుటిన జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు…

AP

ఏపీ లో ఉచిత బస్సు అమలు ముహూర్తం ఖరారు..! ఎప్పుడంటే..?

ఏపీలో మరో పథకం అమలుకు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి కానుండంటంతో ఎన్నికల హామీల అమలు పైన వరుసగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకం అమలు పైన మంత్రివర్గ ఉప సంఘంతో పాటుగా ఆర్టీసీ అధి కారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇప్పటికే మార్గదర్శకాలు దాదాపు సిద్దం అయ్యాయి. తాజా గా జరిగిన…

National

అప్పటి వరకు ఆ నీళ్లు ఇచ్చేదేలే..! పాక్ కు మరో షాక్..!

కాల్పుల విరమణ అమలులోకి రావడంతో పాకిస్తాన్ కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ని క్షమించేది లేదని అంటున్నారు భారతీయ అధికారులు. పాకిస్తాన్ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదని, ఉగ్రవాదాన్ని పూర్తిగా పక్కనపెట్టే వరకు ఆ దేశంపై జాలి చూపేది లేదని తేల్చి చెబుతున్నారు. తాజాగా సింధు జలాల పంపిణీ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ అధికారులు మరోసారి స్పష్టత ఇచ్చారు. పాకిస్తాన్ కి సింధు జలాలు వదిలేది లేదని తేల్చి చెప్పారు.   యుద్ధం…

TELANGANA

రైతులు చస్తున్నా అందాల పోటీలలో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి : కేటీఆర్

ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతన్నల కష్టం మాత్రం తీరడం లేదు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, పంటలు పండించి ధాన్యపు రాశులను మార్కెట్ కు తరలించిన సకాలంలో కొనుగోలు చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క అకాల వర్షాలు, ఓ పక్క మండుటెండలు అన్నదాతలను విలవిలలాడేలా చేస్తున్నాయి.   మళ్లీ అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. అంతేకాదు కొంతమంది అన్నదాతలు పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ కు వెళ్లి వడ దెబ్బతో మృతి చెందుతున్న…

TELANGANA

క్షిపణి తయారీ కేంద్రంగా హైదరాబాద్..!

ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో అనిశ్చిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం రక్షణ రంగంలో అప్రమత్తమైంది. బ్రహ్మోస్, ఆకాష్ వంటి కీలక క్షిపణుల తయారీతో పాటు వాటికి అవసరమైన విడిభాగాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని సంబంధిత తయారీదారులకు ఆదేశాలు జారీ చేసింది. యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు కాకుండా, శాంతి నెలకొన్నప్పుడే సన్నద్ధత కీలకమని కేంద్రం భావిస్తోంది.   క్షిపణి తయారీ కేంద్రంగా హైదరాబాద్ ప్రాధాన్యత భారతదేశపు “మిస్సైల్ క్యాపిటల్”గా పేరుగాంచిన హైదరాబాద్, అనేక ప్రభుత్వ, ప్రైవేట్…

AP

రూ. 22వేల కోట్లతో అనంతపురం జిల్లాలో రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్..!

రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ (ICE)తో పెద్దఎత్తున పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏపీకి క్యూకడుతున్నాయి. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ రూ. 22వేల కోట్లతో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన…

AP

కొడాలి నాని నమ్మక ద్రోహి.. వైసీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాసిం..!

గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిపై అదే పార్టీకి చెందిన మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఖాసిం (అబూ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొడాలి నాని అసమర్థుడని, దశాబ్దాల పాటు గెలిపించిన గుడివాడ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి, కష్టకాలంలో వారిని వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిన నమ్మకద్రోహి అని ఆరోపించారు. ఖాసి వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతూ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.…

National

దేశ భద్రత కోసం 10 శాటిలైట్లు నిరంతరం పనిచేస్తున్నాయి: ఇస్రో చైర్మన్..

దేశ పౌరుల భద్రత, సురక్షతో పాటు వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణ కోసం పది అత్యంత కీలకమైన ఉపగ్రహాలు నిరంతరం నిఘా నేత్రాలుగా పనిచేస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. అగర్తలలో ఆదివారం జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (సీఏయూ) ఐదవ స్నాతకోత్సవంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉపగ్రహాలు దేశ భద్రతకు కవచంలా నిలుస్తున్నాయని ఆయన నొక్కిచెప్పారు.   “దేశ భద్రతను కాపాడుకోవాలంటే, మనకున్న 7,000 కిలోమీటర్ల…

NationalSPORTS

టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై..!

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా రిటైర్ మెంట్ ప్రకటిస్తూ ఇన్‌స్టాలో భావోద్వేగభరిత పోస్ట్‌ చేశారు. భారత్‌ తరఫున కోహ్లీ దాదాపు 14 ఏళ్ల పాటు టెస్టులకు ప్రాతినిధ్యం వహించారు. ఇది తనకెంతో గర్వకారణమని కోహ్లీ చెప్పారు. 2011లో వెస్టిండీస్‌ తో మ్యాచ్ ద్వారా ఆయన టెస్టుల్లో అరంగేట్రం చేశారు. తన కెరీర్‌లో కోహ్లీ 123 టెస్టు మ్యాచ్‌లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో…