News

AP

డీలిమిటేషన్ కు మేం వ్యతిరేకం… దక్షిణాది రాష్ట్రాలకు విలువలేకుండా పోతుంది: కేటీఆర్..

డీలిమిటేషన్ పై కాసేపట్లో చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభంకానుంది. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. చెన్నైలోని ఐటీసీ చోళ హోటల్ లో ఈ భేటీ కొనసాగనుంది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్… బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. వీరంతా…

AP

ప్రధాని మోదీకి జగన్ లేఖ..

డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాలు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ కారణంగా పార్టమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుందని… అందుకే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ లేకుండా చూడాలని కోరుతున్నామని…

AP

ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య కీలక ఒప్పందం..

మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్‌ను ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. 40 నిమిషాలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్, సంక్షేమం కోసమై గేట్స్ ఫౌండేషన్ సహకారంపై చర్చించారు.   చంద్రబాబు ఉంటే టెక్నాలజీ గురించి మాట్లాడకుండా ఉంటారా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐ సాంకేతిక వినియోగంపై ఆలోచనలు పంచుకున్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ తదితర రంగాల్లో టెక్నాలజీ వాడకంపై గేట్స్, బాబుల మధ్య చర్చ జరిగింది. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 పై బిల్ గేట్స్‌కు తన…

AP

ఏపీకి ప్రభుత్వానికి కొత్త సలహాదారులు..

ఏపీలో కూటమి సర్కార్ ప్రభుత్వానికి కొత్తగా సలహాదారులను నియమించింది. వైసీపీ మాదిరిగా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఎంపిక జాగ్రత్త వహించారు. ఎంపికైనవారు ఉన్నత రంగాలకు చెందిన నలుగురు కీలక వ్యక్తులు. ప్రభుత్వం సైతం ఆయా రంగాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో వారి ఎంపిక ప్రభుత్వానికి తేలికైందని ప్రభుత్వ వర్గాల మాట.   కూటమి సర్కార్ కీలకమైన సలహాదారులు   వైసీపీ ప్రభుత్వంలో సలహాదారులకు కొదవలేదు. ప్రతీ శాఖకు, అలాగే ప్రభుత్వానికి దాదాపు 90…

National

9 నెలల నిరీక్షణకు తెర.. భూమిని చేరుకున్న సునీత..

తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడింది. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిని చేరుకున్నారు. సునీత, బుచ్ విల్మోర్‌‌, మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఈ తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండైంది.   గంటకు దాదాపు 27 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చిన డ్రాగన్ క్రూ క్యాప్సుల్ క్రమంగా వేగం తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు 186…

APNationalTELANGANA

ప్రాజెక్టులపై తెలంగాణ పిటిషన్.. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు..

కృష్ణా నదీ ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్లు దాఖలైన వారం రోజుల్లో రిజాయిండర్ ఫైల్ చేయాలని కూడా ఆదేశించింది.   కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం…

TELANGANA

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం..

తెలంగాణ శాసనసభ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించింది. 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తూ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. గ్రూపు-1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1 శాతం రిజర్వేషన్, మాదిగలు ఉన్న గ్రూప్-2లోని కులాలకు 9 శాతం రిజర్వేషన్, మాలలు ఉన్న గ్రూప్-3లోని కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించారు.   ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు…

National

ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం..!

విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం అంశం ఎప్పటినుంచో చర్చనీయాంశంగా ఉంది. తాజాగా, ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గుచూపింది. ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో ఆధార్, ఓటరు కార్డు సాంకేతిక నిపుణుల సంప్రదింపుల కమిటీ భేటీ కానుంది.   ఆధార్ తో ఓటరు కార్డు లింక్ చేయడంపై నేడు కేంద్ర…

AP

మరోసారి విజయసాయి రెడ్డికి సీఐడీ నోటీసులు..

కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సీఐడీ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయసాయిని సీఐడీ అధికారులు ఓసారి ప్రశ్నించారు. తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు పంపించారు. మార్చి 25న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని మంగళగిరి సీఐడీ పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.   గత బుధవారం నాడు విజయసాయిరెడ్డిని బెజవాడ సీఐడీ కార్యాలయంలో దాదాపు 5 గంటల పాటు…

AP

లంచం కోసం మహిళ మంగళసూత్రం తాకట్టు..!

లంచం కోసం మహిళ మంగళసూత్రాలు తాకట్టు పెట్టించిన చిత్తూరు జిల్లా ఎస్సైపై ప్రభుత్వం వేటేసింది. అయితే, ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు, 2023లో గత ప్రభుత్వ హయాంలో జరిగింది. తాజాగా విషయం వెలుగులోకి రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. 2023 సెప్టెంబర్‌లో తన భార్య అదృశ్యమైనట్టు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ తర్వాతి రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ తమ మధ్య కుటుంబ పరమైన వివాదాలు…