హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మకు నీతా అంబానీ కోటి రూపాయల విరాళం..
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ విరాళం బుధవారం నాడు దేవస్థానం బ్యాంక్ ఖాతాలో జమ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ బల్కంపేట ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సందర్భంగా అప్పటి ఆలయ…

