ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్ళీ బెదిరింపులు.. కొడుకును కిడ్నాప్ చేస్తామంటూ వార్నింగ్..
తనకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం వెల్లడించారు. తనను, తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమారుడిని కిడ్నాప్ చేసి చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించినట్లు రాజాసింగ్ ఒక వీడియో ద్వారా తెలిపారు. ఈ బెదిరింపులు తనను భయపెట్టలేవని, దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడాలని ఆయన సవాల్ విసిరారు. ఈ ఘటనకు సంబంధించి రాజాసింగ్ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు.…

