సీఆర్పీఎఫ్ జవాన్ గూఢచర్యం కలకలం.. ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..!
దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై)ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. మోతీరామ్ జాట్ అనే ఈ జవాను పహల్గామ్‌లో ఉగ్రదాడికి ఆరు రోజుల ముందు వరకూ అక్కడే విధులు నిర్వర్తించాడు. అధికారల కథనం ప్రకారం.. మోతీ రామ్ జాట్ 2023 నుంచి పాకిస్థాన్ గూఢచార సంస్థలకు సున్నితమైన సమాచారాన్ని అందిస్తున్నాడు. అతడి…

