మరో మైలురాయి సాధించిన ఇస్రో.. స్పేడెక్స్ డీ-డాకింగ్ ప్రక్రియ సక్సెస్..
అంతరిక్ష ప్రయాణంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అద్భుతమైన ఘనతను సాధించింది. ఇస్రో గురువారం తన స్పేడెక్స్ డీ-డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే ఈ మిషన్‌ను ఇస్రో చేపట్టింది. భవిష్యత్ లో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రకు అవసరమైన ఈ కీలక పరిజ్ఞానాన్ని ఇస్రో ఒడిసిపట్టింది.భారత అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్-4, గగన్‌యాన్ సహా భవిష్యత్ ప్రయోగాలకు ఇస్రో మార్గం సుగమం చేసినట్లు.. భారత అంతరిక్ష సంస్థకు…

