ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు జై కొట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారు: కేసీఆర్..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఎర్రవెల్లి ఫాంహౌస్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారికి భవిష్యత్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు ఇవాళ కష్టాల్లో ఉన్నారని, కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయి గోసపడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిజస్వరూపం ఏంటో ప్రజలకు అర్థమైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్… తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ అని స్పష్టం చేశారు. నేడు…

