విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై కీలక అప్డేట్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ విజయవాడకు మరో గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన రెండు మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటైన విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా విజయవాడ నగరంలో ఏలూరు, బందర్ రోడ్డుల వైపు సేకరించాల్సిన భూమిని అధికారులు గుర్తించారు. దీంతో త్వరలో ఈ భూసేకరణ ప్రారంభం కాబోతోంది. విజయవాడ నగరంలో మెట్రో ప్రాజెక్టును రెండు…

