News

AP

విశాఖకు త్వరలో గూగుల్… సీఎం చంద్రబాబు ప్రకటన..!

అమరావతిలోని విట్ యూనివర్సిటీలో ‘వి లాంచ్‌పాడ్ 2025 – స్టార్టప్ ఎక్స్‌పో’లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం నూతన భవనాలు ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడారు.   రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని వివరించారు.   విశాఖపట్నం అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ,…

National

భారత్ మాపై దాడి చేయడం ఖాయం: పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు..

కశ్మీర్‌లో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ వైపు నుంచి సైనిక దాడి జరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి తర్వాత ఇరు అణ్వస్త్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి.   గత వారం ఏప్రిల్ 22న కశ్మీర్‌లో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పౌరులపై జరిగిన ఈ దారుణ…

TELANGANA

గ్రూప్-1 పిటిషనర్లకు తెలంగాణ హైకోర్టు రూ. 20,000 చొప్పున జరిమానా..

టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంపై పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు అఫిడవిట్లు సమర్పించి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ 19 మంది పిటిషనర్లకు రూ.20,000 జరిమానా విధించింది. అంతేకాకుండా, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.   తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మొత్తం 19 మంది అభ్యర్థులు హైకోర్టును…

AP

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి..!

రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 10 జిల్లాలకు సంబంధించి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్‌) చైర్మన్ల నియామకాలను ఖరారు చేశారు.   వివిధ జిల్లాల డీసీసీబీ చైర్మన్లుగా నియమితులైన వారు:   ఈ నియామకాలతో కీలకమైన సహకార రంగ సంస్థలకు కొత్త అధిపతులు వచ్చినట్లయింది. ప్రభుత్వం త్వరలోనే మరిన్ని నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం…

AP

ఏపీ లిక్కర్‌ స్కాం.. సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌..

ఏపీ లిక్కర్ పాలసీలో ట్విస్టులు ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి. ఎవరెవరికి సంబంధం ఉంది.. మద్యం పాలసీ ఎలా తయారు చేశారు.. ఆర్గనైజ్డ్ గా ముడుపులు ఎలా మళ్లించారు.. కుట్రలకు కేంద్రస్థానం ఏంటి.. సప్లై, సేల్స్ కు ఆఫ్ లైన్ ఎందుకు పెట్టారు.. ఇదంతా దూరం నుంచి చూస్తే ఏమీ అర్థం కాదు. కానీ దగ్గరి నుంచి చూస్తే ఒక్కో లెక్క బయటికొస్తుంది. ఇప్పుడు సిట్ కూడా అదే చేస్తోంది.   తాజాగా ఏపీ లిక్కర్‌ స్కాంలో…

AP

ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ..

ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కేటగిరీ కింద 89,788 మందిని అర్హులుగా గుర్తించారు. పింఛను తీసుకునే భర్త చనిపోతే తదుపరి నెల నుంచే భార్యకు పింఛను అందేలా చర్యలు చేపట్టారు. ఈ నెల 30లోగా వివరాలు సమర్పిస్తే, జూన్ 1 నుంచి పింఛను జారీ చేయనున్నారు.   కాగా.. ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల…

AP

‘సస్పెన్షన్‌‌ తాత్కాలిక విరామం’.. మళ్లీ వస్తానన్న దువ్వాడ..

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు, ఎప్పుడు, ఏ పార్టీ వైపు వెళ్తారో తెలీదు. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది నేతలు ఆచితూచి మాట్లాడుతున్నారు.. ఆపై అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఒకరు. ఆయన మాటలకు అర్థాలు ఎప్పుడూ వేరుగానే ఉంటాయి. దాని లోతుల్లోకి వెళ్తే తప్ప ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు అదే చేస్తున్నారు.   దువ్వాడ రియాక్ట్ వెనుక   దువ్వాడ శ్రీనివాసరావు.. సరిగ్గా ఐదేన్నరేళ్ల…

TELANGANA

అమ్మాయిలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్….

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యంపై దృష్టి సారిస్తోంది. తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో యువతులకు సరైన ఆహారం లేక నానా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందుకోసం చిన్నప్పటి నుంచి మంచి ఆహారం తీసుకుంటే వ్యాధులు రావని భావిస్తోంది. దీనికి తోడు మారుతున్న జీవనశైలి, ఆపై ఆహారం అలవాట్లు. ఇవన్నీ టీనేజీ యువతులపై ప్రభావం కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యువతల కోసం కొత్త స్కీమ్ తీసుకురావాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్.   యువతులకు కొత్త స్కీమ్   తెలంగాణలో…

TELANGANA

హైదరాబాద్ లో మరో ప్రపంచ స్థాయి సమ్మిట్…

హైదరాబాద్ లో మరో ప్రపంచ స్థాయి సమ్మిట్. ఇంతకీ భారత్ సమ్మిట్ పేరిట జరగనున్న ఈ కార్యక్రమ సరళి ఎలాంటిది? ఇందులో ఎవరెవరు పాల్గొంటారు? ఏయే అంశాలపై చర్చ సాగనుంది? దీని అసలు ఉద్దేశమేంటి? ఆ ఫుల్ డీటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.   కాంగ్రెస్ దార్శనికతను అద్దం పట్టేలా.. భారత్ సమ్మిట్ 2025 ఏప్రిల్ 25, 26వ తేదీల్లో హైదరాబాద్ లోని HICCలో నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. అలీనోద్యమానికి పునాది వేసిన చారిత్రాత్మక బాండుంగ్ సమావేశం…

National

పహల్గామ్‌ ఉగ్రదాడి.. పాక్‌పై భార‌త్ తీసుకున్న ఏడు క‌ఠిన చ‌ర్య‌లివే..!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప‌ర్యాట‌కులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ ఉగ్ర‌దాడిలో పాకిస్థాన్ హ‌స్తం ఉంద‌ని ఆరోపిస్తూ దాయాది దేశంపై భార‌త్ క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ఇప్పటివ‌ర‌కు పాక్‌పై ఏడు చర్యలు తీసుకుంది. దాడికి సంబంధించిన సరిహద్దు సంబంధాలను చర్చించిన తర్వాత భార‌త‌ ప్రభుత్వం బుధ‌వారం ఐదు చర్యలు తీసుకోగా, గురువారం మరో రెండు చర్యలు తీసుకుంది.   పహల్గామ్‌ ఉగ్రవాద దాడి నేప‌థ్యంలో పాక్‌పై భార‌త్‌ తీసుకున్న ఏడు…