అడిషనల్ ఎస్పీలు సస్పెన్షన్.. తర్వాత ఎవరు..!
ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. కేవలం రాజకీయ నాయకులవే కాకుండా వ్యాపారులు, సినిమా హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలు అరెస్టులు కూడా జరిగాయి. తాజాగా ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావును పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. వీరిద్దరు 48 గంటలు పోలీసుల అదుపులో ఉండడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు…

