నన్ను 181 కేసులతో ఇబ్బంది పెట్టారు: కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన
కొడంగల్ వేదికగా జరిగిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తనను రాజకీయంగా అణచివేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో తనపై ఏకంగా 181 కేసులు పెట్టారని, అక్రమంగా చంచల్‌గూడ జైలులో బంధించి తన కుటుంబాన్ని తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని పేర్కొన్నారు. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనను జైలు పాలు చేసి, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. తాను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ…

