గ్రామీణ పేదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల కుట్రలు -బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి
పేదలకు మంచి జరిగినా ఆ నిర్ణయం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తీసుకుంది కాబట్టి వ్యతిరేకించాల్సిందే” అన్న పడికట్టు భావజాలంతో ఉండే కమ్యూనిస్టు పార్టీ నేతలు “వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” పథకంపై వక్రభాష్యాలు చెబుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని నేటి కాలానికి తగ్గట్లుగా మార్పులు చేస్తే అందులోని మంచిని చూడాల్సింది పోయి పేరు మార్చారని విమర్శిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతిపిత. ఓ పథకానికి ఆయన పేరు…

