నటి హేమ ఇంట్లో విషాదం – తల్లి కోళ్ల లక్ష్మి కన్నుమూత
ప్రముఖ సినీ నటి హేమ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లాలోని వారి స్వగ్రామమైన రాజోలులో నిన్న రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. తల్లి మరణవార్త తెలియగానే నటి హేమ హుటాహుటిన స్వగ్రామానికి చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి ఆమె కన్నీరుమున్నీరయ్యారు, “నిన్న ఉదయం కూడా నాతో ఎంతో బాగా మాట్లాడింది. ఇంతలోనే ఇలా జరిగిపోయింది” అంటూ రోదించిన తీరు అక్కడివారిని కలచివేసింది. గతంలో తాను అరెస్ట్…

