ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి నాంపల్లి కోర్టుకు తరలింపు
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈరోజు (శనివారం) ఉదయం సీసీఎస్ పోలీసులు కూకట్‌పల్లి ప్రాంతంలో ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ తర్వాత ఉదయం నుంచి సీసీఎస్ పోలీసులు అతడిని విచారించి, అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇమ్మడి రవి బ్యాంకు ఖాతాలో ఉన్న మూడు కోట్ల రూపాయల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇతను కరేబియన్ దీవుల్లో ఉంటూ ‘ఐబొమ్మ’…

