మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ.. ఎన్ని జిల్లాలు ఎగిరిపోతాయో..?
తెలంగాణలో మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. గత బీఆర్‌ఎస్ సర్కార్ రాజకీయ అవసరాల కోసం పది జిల్లాలో ఏర్పడిన తెలంగాణలో పాత జిల్లాలను చలువలు పలువలుగా చీల్చేసింది. పదికి అదనంగా 23 జిల్లాలు.. మొత్తం 33 జిల్లాలుగా మార్చేసింది. ఇక రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు కూడా అస్తవ్యస్తంగా జరిగింది. పదేళ్ల తర్వాత తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్ష చేయాలని భావిస్తోంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్…

