స్కంద ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ మూవీ స్కంద ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 28వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన స్కంద సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. హీరో రామ్ కు ఈ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వ లేకపోయింది.…

