News

AP

ఏపీలో మహిళా సాధికారికత అంశంపై అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ

అమరావతి: ఏపీలో మహిళా సాధికారికత అంశంపై అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. మంత్రులు ఆర్ కే రోజా, ఉష శ్రీచరణ్, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కంగాటి శ్రీదేవి, ధనలక్ష్మి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలు ఆర్థిక స్వావలంబనను సాధించారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును చీటర్‌గా అభివర్ణించారు. చంద్రబాబు చీటర్…

AP

ఈ ఏడాది మొహమాటంగా పలకరించిన నైరుతి రుతుపవనాలు అరకొర వర్షపాతం తర్వాత వెనక్కి

ఈ ఏడాది మొహమాటంగా పలకరించిన నైరుతి రుతుపవనాలు అరకొర వర్షపాతం తర్వాత వెనక్కి మళ్లడం ప్రారంభించాయి. రాజస్తాన్ నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ ఇవాళ ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో 5 శాతం లోటు వర్షపాతం నమోదుచేసిన రుతుపవనాలు.. వారం రోజులు ఆలస్యంగా వెనక్కి మళ్లుతున్నట్లు ఐఎండీ తెలిపింది. దేశవ్యాప్తంగా జూన్ నెలలోనే నైరుతి రుతుపవన వర్షాలు పలకరించాల్సి ఉండగా.. ఆలస్యంగా జూలైలో అవి విస్తరించాయి. ఆ తర్వాత…

TELANGANA

రాయ్‌పూర్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి

రాయ్‌పూర్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాజకీయ వాతావరణం వేడెక్కింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వాడివేడిగా విమర్శలు, ప్రతి విమర్శలను సంధించుకుంటోన్నారు. ఆరోపణలు- ప్రత్యారోపణలకు దిగుతున్నారు అన్ని పార్టీల నాయకులు. తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన సస్పెండెడ్ శాసన సభ్యుడు టీ రాజా సింగ్ తెరపైకి వచ్చారు. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై నిప్పులు చెరిగారు. ఘాటు విమర్శలను సంధించారు. ఒవైసీ వంటి…

World

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా (NASA) సంచలనం

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా (NASA) సంచలనం సృష్టించింది.. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఇప్పటివరకు విశ్వాంతరాల మీద అనేక రకాల పరిశోధనలను సాగించిన నాసా.. ఇక తన దృష్టిని గ్రహ శకలాలపై సారించింది. అస్టరాయిడ్స్‌ పై సమగ్ర అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఆ అస్టరాయిడ్ (Asteroid) పేరు బెన్ను. 1999 సెప్టెంబర్ 11వ తేదీన దీన్ని తొలిసారిగా గుర్తించింది నాసా. కార్బోనేషియస్ గ్రహశకలం ఇది. దీని విస్తీర్ణం 565 మీటర్లు. సెకెనుకు 28…

AP

తిరుమలలో రాయల కాలం నాటి సంప్రదాయం- కన్నుల పండువగా

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల తాకిడి పెరిగింది. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. నడక మార్గాలన్నీ రద్దీగా మారుతున్నాయి. బుధవారం 74,884 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,213 మంది తలనీలాలను సమర్పించారు. గరుడ సేవ తరువాత భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. కృష్ణ తేజ గెస్ట్…

AP

మోత్కుపల్లి మాటలను గుర్తు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం

విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ ప్రభుత్వంపై భారత్ రాష్ట్ర సమితి నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన విమర్శలను ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి తిప్పి కొట్టారు. దీక్షకు దిగడం పట్ల ఘాటు విమర్శలు…

National

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ప్రత్యేకించి- తెలంగాణపై దీని తీవ్రత అధికంగా ఉంటోంది. హైదరాబాద్‌లో అతి భారీ వర్షం దంచికొట్టింది. మరో మూడు రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతం వాయవ్య దిశలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ దక్షిణ ప్రాంతాల మీదుగా విస్తరించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలో మరో మూడు రోజుల…

AP

ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ దశలో బాబు పిటీషన్ల జాబితా ఇదే

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ…

AP

Botsa Satyanarayana: స్కామ్‌లో వాస్తవాలు తెలుసు కాబట్టే పారిపోతున్నారు..

స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు చంద్రబాబును విచారించనున్నారు. రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన కస్టడీ మేరకు సీఐడీ విచారణ…

National

ఉత్తర్ ప్రదేశ్ మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం

ఉత్తర్ ప్రదేశ్ మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతాన్ని సర్వే చేయాలిన నమోదైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సమస్యను అలహాబాద్ హైకోర్టు నిర్ణయానికి వదిలివేసింది. దీనిపై దాఖలైన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు విచారిస్తోంది. ఈ వివాదంపై దాదాపు 10 పిటిషన్లు అలహాబాద్ హైకోర్టు దాఖలైనట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.…