చంద్రయాన్ 3.. . వాట్ నెక్స్ట్: తెరపై సంచలన `మిషన్`
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది. రోవర్‌లో లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (లిబ్స్), ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్‌ను పేలోడ్స్‌గా పంపించారు శాస్త్రవేత్తలు. ల్యాండర్ మాడ్యూల్ పేలోడ్స్ ఇండియన్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ…

